Wednesday, April 30, 2025
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించుకోవాలి..

అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించుకోవాలి..

– తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్..

నవతెలంగాణ – మల్హర్ రావు

భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ 135వ జయంతి వేడుకలు అన్నివర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ కోరారు. ఆదివారం కాటారం మండల కేంద్రంలో మాట్లాడారు భారతరత్న, ప్రపంచ జ్ఞానశిఖరం బాబాసాహెబ్ డా.బీ.ఆర్.అంబేడ్కర్ మరణం తర్వాత ఆయన భావజాలానీ భూమిలో పాతిపెట్టి చాలా సంతోషించారు కానీ వాళ్ళకు తెల్వదు ఆయన పాతిపెట్టిన మొలకెత్తి మహా వృక్షం అయిన ప్రపంచ దేశాలు ఆయనను కిర్తిస్తాయని అస్సలు ఊహించలేదన్నారు. ఆయనను ప్రపంచ దేశాలు కిర్తిస్తాయనడానికి ఒక్కే ఒక్క ఉదాహరణ ఆయన పుట్టినరోజును (ఏప్రిల్ 14thను) ఐక్య రాజ్య సమితి జ్ఞానం పుట్టినరోజుగా డిక్లేర్ చేసింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తాన్ని అక్షరాలుగా మార్చి బ్రాహ్మణ దోపిడీ తత్త్వ శాస్త్రానికి విరుగుడుగా పీడిత వర్గ విముక్తి శాస్త్రాన్ని మీకందించాను.భారత రాజ్యాంగ నిర్మాత, ఆర్థిక శాస్త్రవేత్త, సంఘసంస్కర్త, భారతదేశ రాజ్యాంగ పితామహుడుగా ప్రసిద్ధిగాంచిన భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  135వ జయంతి వేడుకలను ఏప్రిల్ 14 సోమవారం నాడు భూపాలపల్లిలో బాతాల రాజన్న భవన్ లో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకొని, ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img