Wednesday, April 30, 2025
Homeసినిమా'అఖండ 2: తాండవం' కోసం..

‘అఖండ 2: తాండవం’ కోసం..

బాలకృష్ణ, బోయపాటి శ్రీను 4వసారి ‘అఖండ 2: తాండవం’ కోసం కొలాబరేట్‌ అయ్యారు. ‘అఖండ’కు ఈ సీక్వెల్‌ యాక్షన్‌, ఇంటెన్స్‌ నెక్స్ట్‌ లెవల్‌కి తీసుకెళ్ల నుంది. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఈ సినిమా నెక్స్ట్‌ షెడ్యూల్‌ జార్జియాలో జరగనుంది. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను అక్కడ అద్భుతమైన ప్రదేశాల కోసం రెక్కీ చేస్తున్నారు, బాలకష్ణ, ఇతర ప్రముఖ తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జార్జియా సీనరిక్‌ బ్యూటీ నేపథ్యంలో ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌గా ఉంటాయి. జార్జియాలో జరుగుతున్న రెక్కీల మధ్య బోయపాటి శ్రీను తన పుట్టినరోజును జరుపుకున్నారు. హై బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌లో సంయుక్త ఫీమేల్‌ లీడ్‌గా కనిపించనుంది. ‘అఖండ 2’ పాన్‌ ఇండియా లెవెల్‌లో గాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్‌ 25న థియేటర్లలోకి రానుంది. ‘బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ అనగానే అటు ప్రేక్షకుల్లోను, ఇటు నందమూరి అభిమానుల్లోను భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాని బోయపాటి శ్రీను రూపొందిస్తున్నారు. ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా, ఆ సినిమాలకు మించి ఈ సినిమాలో అన్ని అంశాలూ సర్‌ప్రైజ్‌ చేసేలా ఉండాలని టీమ్‌ మొత్తం కృషి చేస్తోంది. ఈ సినిమా కచ్చితంగా భారీ బ్లాక్‌బస్టర్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం’ అని మేకర్స్‌ చెప్పారు. బాలకష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: ఎం తేజస్విని నందమూరి, సంగీతం: తమన్‌, డీవోపీ: రాంప్రసాద్‌, ఆర్ట్‌ : ఏఎస్‌ ప్రకాష్‌, ఎడిటర్‌: తమ్మిరాజు, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img