- ఆందోళనలో ప్రజలు..
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు - మండలంలోని పెద్దతూండ్ల గ్రామపరిదిలోని నారాయణపల్లి, ఎస్సికాలనికి సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంకర్ అపరిశుభ్రంగా మారడంతో తాగునీరు కలుషితం కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాటర్ ట్యాంకర్ శుభ్రం చేసి పరిశుభ్రమైన తాగునీరు అందించాల్సిన పంచాయతీ, ఇంట్ర, మీషన్ భగీరథ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ట్యాంకర్ లో ఉన్న నీరు పచ్చగా ఉండీ దుర్వాసన వేదజల్లుతోంది. ఇలాంటి అపరిశుభ్రమైన నీటిని తాగడంతో ప్రజలు అనారోగ్యానికి గురివడం ఖాయమని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు వాటర్ ట్యాంకర్ శుభ్రం చేసి పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -