నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో మరోసారి కాల్పులు కలకలం రేపింది. ఓ సాయుధుడు అకస్మాత్తుగా కాల్పులు జరిపి ఇద్దరిని హతమార్చాడు. ఆరుగురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల తర్వాత పోలీసులు వెంటనే ఘటనాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో యూనివర్సిటీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
- Advertisement -