– పశువులను ఢీకొన్నా ‘తీవ్ర ప్రమాదాలు’
– భద్రతా చర్యలు అవసరం
– ఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించాలి
– లోకోపైలట్లపై నిరంతర ఒత్తిడి
– రైల్వే సేఫ్టీ కమిషన్ నివేదిక
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలో సమూల మార్పులను తీసుకొస్తున్నామని కేంద్రంలోని మోడీ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నది. ఇందులో భాగంగా భారత్‌లోని మొట్టమొదటి సెమీ-హై-స్పీడ్ ‘వందే భారత్’ రైలుకు తీవ్ర ప్రచారాన్ని కల్పించింది. అది తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకున్నది. అయితే, ‘వందే భారత్’ భద్రతా ప్రమాణాలు మాత్రం ఆందోళనను కలిగిస్తున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పశువులను ఢకొీన్న సందర్భాలలో కూడా తీవ్రమైన ప్రమాదాలకు గురవుతుందని రైల్వే భద్రతపై ఒక నివేదిక పేర్కొన్నది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రైల్వే సేఫ్టీ కమిషన్ ఈ నివేదికను రూపొందించింది.
‘దృఢమైన కంచెను ఏర్పాటు చేయాలి’
ఈ నివేదిక ప్రకారం.. వందే భారత్ రైళ్లలోని ప్రముఖ కోచ్ లోకోమోటివ్.. సాధారణ రైళ్ల కంటే చాలా తేలికైనది. ఏదైనా అడ్డంకిని ఢకొీనటం లేదా పశువులు కూడా ఢకొీంటే అధిక వేగంతో తీవ్రమైన ప్రమాదానికి దారితీయవచ్చు. హై-స్పీడ్ రైళ్ల నిర్వహణకు సంబంధించి రైల్వేలు తీసుకోవలసిన భద్రతా చర్యలను నివేదిక వివరించింది. రైళ్లకు ముప్పును కలిగించే మానవులు, పశువులను నిరోధించడానికి దృఢమైన కంచెను ఏర్పాటు చేయాలని సూచించింది. 160 కి.మీ. వేగంతో రైళ్లు నడిచే మార్గాల్లో లెవల్ క్రాసింగ్ గేట్లను తొలగించాలని పేర్కొన్నది.
‘ఆర్పీఎఫ్ సిబ్బందిని నియమించండి’
భారతీయ రైల్వే.. క్రమం తప్పకుండా అతిక్రమించే ప్రదేశాలు, పశువుల ప్రవేశ ప్రదేశాలను గుర్తించాలని నివేదిక సూచించింది. రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) సిబ్బందిని మోహరించడం, క్రమం తప్పకుండా పెట్రోలింగ్ చేయడం, రైతులు తమ పశువులతో దాటడానికి వీలుగా సబ్‌వేను అందించడం వంటి తగిన యంత్రాంగాన్ని రూపొందించాలని వివరించింది. భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై-స్పీడ్ రైళ్లు అయిన వందే భారత్ రేక్‌లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ, మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ, రారుబరేలిలలో తయారు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 26 నాటికి రైల్వే నెట్‌వర్క్‌లో మొత్తం 136 వందే భారత్ రైలు సేవలు నడుస్తున్నాయి.
అధిక వేగంతో పశువులను ఢకొీంటే తీవ్రమైన ప్రమాదాలు సంభవించే అవకాశమున్నదని భద్రతా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. రైల్వేలు అనేక మార్గాల్లో 160 కి.మీ. వేగంతో రైళ్లను నడపాలని యోచిస్తున్న సమయంలో ఈ హెచ్చరిక రావటం గమనార్హం. ఆర్పీఎఫ్, ఇతర శాఖ అధికారులు సమయానికి ఉమ్మడి తనిఖీలు చేసి అతిక్రమణలను నిరోధించాలని నివేదిక పిలుపునిచ్చింది. రైల్వే ప్రాపర్టీని ఆనుకుని ఉన్న భూనివాసితులు ట్రాక్ దాటడం ద్వారా కలిగే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైళ్ల వేగాన్ని 130 నుంచి 160 కిలోమీటర్లకు పెంచుతున్నప్పుడు శాశ్వత, తాత్కాలిక వేగ పరిమితులు పెద్ద సంఖ్యలో ఉండటంతో లోకో పైలట్లకు నిరంతరం ఒత్తిడి కలుగుతున్నది. ఈ విషయంలో రైల్వే తగిన చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది.
అమ్మో..! వందే భారత్
- Advertisement -
RELATED ARTICLES