నవతెలంగాణ – హైదరాబాద్ : వాంఖడేలో యంఐతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో వేగంగా 1000 రన్స్ పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచారు. మొత్తంగా 575 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ జాబితాలో తొలి స్థానంలో రస్సెల్(545), హెడ్ తర్వాత క్లాసెన్(594), సెహ్వాగ్(604), మ్యాక్స్‌వెల్(610), యూసుఫ్ పఠాన్(617), నరైన్(617) ఉన్నారు.
- Advertisement -