Wednesday, April 30, 2025
Homeఆదిలాబాద్ఆదిలాబాద్ క‌లెక్ట‌ర్‌కు అరుదైన గౌర‌వం

ఆదిలాబాద్ క‌లెక్ట‌ర్‌కు అరుదైన గౌర‌వం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రగతిశీల బ్లాక్ ప్రోగ్రాం కేటగిరీలో భాగంగా ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా సోమవారం ప్రధాని చేతుల మీదుగా అందుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలం బ్లాక్ 2024 సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో జిల్లా కలెక్టర్, ఆయా శాఖల అధికార యంత్రాంగం అశేష కృషి చేసింది. ఈ కృషిలో భాగంగా ఆదిలాబాద్ ప్రత్యేక ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారానికి ఎంపికైంది. తెలంగాణలోని మారముల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్.. ఈ అవార్డును అందుకోవడం పట్ల ప్రధానమంత్రి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో ప్రతి ఒక్కరు కీలకపాత్ర పోషించాలని అందుకే ఈ అవార్డు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img