– మరో ఏడాది పాటు వెసులుబాటు : ఉడాయ్
న్యూఢిల్లీ : దేశంలోని కోట్లాది మంది ఆధార్ కార్డ్ యూజర్లకు ఉడాయ్ మరోసారి భారీ ఉపశమన కలిగించింది. ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకునేందుకు గడువును మరోసారి పొడిగించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆధార్ అప్డేట్కు చివరి తేదీ జూన్ 14 వరకు ఉండేది. కానీ, దాన్ని జూన్ 14, 2026 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఉడారు ఈ విషయాన్ని వెల్లడించింది. దాంతో యూజర్లు మరో సంవత్సరం పాటు ఆధార్‌లో తమ వివరాలను అప్డేట్ చేసుకునే సదుపాయం లభించనున్నది. ఈ నిర్ణయంతో లక్షలాది మందికి ఊరట కల్పించనుందని ఉడారు పేర్కొంది. ఆధార్‌ను ఎవరైనా యూజర్లు తమ తాజా సమాచారంతో అప్డేట్ చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లను ‘మై ఆధార్’ పోర్టల్ ద్వారా ఉచితంగా అప్లోడ్ చేసుకునేందుకు వీలుంది. ప్రస్తుతం ఉన్న డేటాలో ఏవైనా మార్పులుంటే దానికి ఉడారు అవకాశం కల్పిస్తున్నది. ఇందులో భాగంగా యూజర్లు అడ్రస్‌ను ఉచితంగా మార్చుకోవచ్చు. వాస్తవానికి వివాహం జరిగిన వారు.. వలస వెళ్లేవారు.. ఉద్యోగరీత్యా వివిధ చోట్లకు వెళ్లేవారి చిరునామా మారుతూ ఉంటుంది.
ఈ క్రమంలో ఉడారు నిర్ణయం వీరికి ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది. వాస్తవానికి ఆధార్ తీసుకొని పదేండ్లు పూర్తయిన వారంతా తప్పనిసరిగా తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఉడారు సూచించిన విషయం తెలిసిందే. గతంలో ఈ ప్రక్రియ కోసం ఆధార్ కేంద్రాల్లో రూ.50 వసూలు చేసే వారు. అదే అవకాశాన్ని ఆన్లైన్లో ఉచితంగా చేసుకునేందుకు ఉడారు వీలుకల్పిస్తున్నది.
ఆధార్‌ను అప్డేట్ చేయడం ఇలా..
ఎyaaసష్ట్రaaతీ.బఱసaఱ.స్త్రశీఙ.ఱఅ లోకి లాగి కావాలి. మొదట మీ ఆధార్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. మీ ఆధార్ ఎన్రోల్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక మీ ఆధార్ వివరాలు కనిపిస్తాయి. వివరాలు అన్నీ సరైనవా కాదా? చూసుకోవాలి. ఏవైనా తప్పులుంటే మార్పులు చేసుకోవాలి. వివరాలు అన్నీ సరిగ్గా ఉంటే నెక్స్ట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అయితే, ఏవైనా మార్పులు ఉంటే.. అందుకు సంబంధించిన వివరాలను మార్చుకొని.. సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత 14 అంకెల రిక్వెస్ట్ పిన్ నంబర్ వస్తుంది. ఈ నంబర్ సహాయంతో ఎప్పటికప్పుడు మీ ఆధార్ అప్డేట్ వివరాలను చెక్ చేసుకునేందుకు వీలుంటుంది.
ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు
- Advertisement -
- Advertisement -