Tuesday, April 29, 2025
Homeకరీంనగర్ఆపరేషన్ కగార్ ని నిలిపివేయాలి

ఆపరేషన్ కగార్ ని నిలిపివేయాలి

-అఖిలపక్ష నాయకులు డిమాండ్
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్

ఛత్తీస్‌గఢ్‌ కర్రెగుట్టలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ ని నిలిపి వేసి, శాంతిని నెలకొల్పాలని అఖిల పక్ష నాయకులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చత్తీస్ ఘడ్ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో గల కర్రెగుట్ట లో గత నాలుగైదు రోజులుగా యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నదని, ఆ ప్రాంత ఆదివాసి, గిరిజనులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారన్నారు. గత రాత్రి నుండి పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఎంతో మావోయిస్టులు, ఆదివాసీలు హతమైయ్యారన్నారు. కర్రెగుట్ట బేస్ క్యాంపులను ఎత్తివేసి ఆపరేషన్ కగార్ ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. మావోయిస్టుల తో చర్చలు జరిపి శాంతి ని నెలకొల్పలన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సిపిఎం జిల్లా కార్యదర్శి మూశం రమేష్ సీపీఐఎంఎల్ నాయకుడు సోమిశెట్టి దశరథం బొజ్జ కనకయ్య, సకినాల అమర్, మార్వాడీ సుదర్శన్ , అంకని భాను, రాగుల రాములు, బడే స్వామిదాస్ చెట్కూరి ఆంజనేయులు గౌడ్, గొట్టె రవి, మిట్టపెల్లి రాజమౌళి, దర్శనం కిషన్, వేమండ్ల రమేష్, కల్లూరి చందన, పోకల సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img