నవతెలంగాణ-హైదరాబాద్: పెహల్గామ్ ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పెహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు.. స్వాతంత్య్ర సమరయోధులుగా ఇషాక్ అభివర్ణించారు. ఇస్లామాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఇషాక్ దార్ మాట్లాడుతూ.. ‘మంగళవారం మధ్యాహ్నం ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లోని బైసరాన్ లోయలో ఉగ్రదాడికి పాల్పడిన వారు.. స్వతంత్య్ర సమరయోధులై ఉండొచ్చు’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
- Advertisement -