నవతెలంగాణ-హైదరాబాద్: అకాల వర్షాలు ఉత్తర భారత్‌ను నీట ముంచిన విషయం తెలిసిందే. దేశరాజధాని ఢిల్లీలో భారీగా కురిసిన వర్షాలకు రవాణా, పలు కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉత్తరాఖండ్‌లో బలమైన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. తాజాగా మరోసారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని భారత్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని విదర్భ, వడదోర, ఛత్తీస్ గడ్, జార్ఖండ్, ఒడిసా, బీహార్, ప.బెంగాల్ ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయని ఐఎండీ పేర్కొంది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకొని..సురక్షితంగా ఉండాలని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఆ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి: ఐఎండీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES