నవతెలంగాణ మల్హర్ రావు.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 26వ వర్ధంతి సందర్భంగా కాటారం, మల్హర్, మహముత్తారం, పలిమేల, మహాదేవపూర్ మండలాల్లోని రోగులను హైదరాబాద్ పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇటీవల కాటారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ నేపథ్యంలో రోగులను ఆసుపత్రికి తరలించి అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాల పంపిణీ ఏర్పాటు చేసి, శస్త్ర చికిత్స అవసరం ఉన్న వారిని వివిధ బ్యాచ్ లుగా విభజించారు. ఈనెల 27న 7వబ్యాచ్ ని తీసుకువెళ్లి, అన్ని విధాలుగా, చూసుకొని దగ్గరుండి ఆపరేషన్ చేయించి తిరిగి మంగళవారం వారి వారి ప్రాంతాలకు క్షేమంగా తీసుకువచ్చినట్టుగా మహేంద్రనాథ్ యాదవ్ తెలిపారు.