నవతెలంగాణ-హైదరాబాద్: విజింజం అంతర్జాతీయ ఓడరేవు ప్రారంబోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా బ్లాక్ కూటమికి కేరళ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రధాన మూలస్తంభమని చెప్పారు. శశి థరూర్ కూడా తనతో ఉన్నారని, తన వ్యాఖ్యలతో ఈరోజు రాత్రి ఎంతో మందికి నిద్ర బంగమవుతుందని ప్రధాని చమత్కారించారు. శుక్రవారం కేరళ సీఎం కలిసి పీఎం విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించారు. ఈ తర్వాత ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ మాట్లాడారు. దేశంలో ఇది గొప్పకట్టడమని, ఆధునిక యుగానికి ప్రతీక అని, ఈ రేవుతో బహుళ అవకాశాలు కలిగి ఉన్నాయన్నారు. అదే విధంగా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించొచ్చని తెలిపారు. ఓడరేవు ప్రారంభోత్సావానికి వచ్చిన ప్రధాని మోడీకి సీఎం పినరయి కృతజ్ఞత తెలిపారు. విజింజం ప్రాజెక్టు సహకారం అందించన ఆదానీ గ్రూప్ సంస్థకు అభినందించారు. విజింజం ఓడరేవు కేరళకు మరో మైలు రాయి నిలుస్తుందని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్టును జాతీకి అంకితం చేసినందుకు రాష్ట్రప్రజల తరుపున ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు సీఎం పినరయి విజయన్. విజింజం ఇంటర్నేషనల్ ట్రాన్స్‌షిప్‌మెంట్ డీప్‌వాటర్ మల్టీపర్పస్ సీపోర్ట్ పోర్ట్ ప్రస్తుతం డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ , ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ కాంపోనెంట్‌తో అదానీ విజింజం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డిసెంబర్ 5, 2015న నిర్మాణాన్ని ప్రారంభించింది. తాజాగా ఈ ఓడరేవు నిర్మాణం పూర్తి కావడంతో ప్రధాని మోడీ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.
ఇండియా బ్లాక్ కూటమికి కేరళ సీఎం మూలస్తంభం: ప‌్రధాని మోడీ
- Advertisement -
RELATED ARTICLES