Wednesday, April 30, 2025
Homeఖమ్మంఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారుల తనిఖీకీ ఆటంకాలు…

ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారుల తనిఖీకీ ఆటంకాలు…

– నిరసనలతో వెనుతిరుగుతున్న అధికారులు…
– మండల వ్యాప్తంగా విస్తరిస్తున్న ఆందోళనలు…
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారుల జాబితా నిజనిర్ధారణ కు వెళ్ళిన తనిఖీ అధికారులకు స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మండలంలోని రామన్నగూడెం లో ప్రారంభం అయిన ఈ నిరసన సెగ అశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలోని గుర్రాల చెరువు,నారాయణపురం కు చేరింది.సోమవారం భూ భారతి అవగాహన కు వచ్చిన మంత్రి పొంగులేటి ని సైతం గుర్రాల చెరువు పేదలు అడ్డుకున్నారు. ఇదే క్రమంలో మంగళవారం నారాయణపురం విచారణకు వెళ్ళిన అధికారులకు సైతం ఇదే నిరసన ఎదురైంది.   అర్హులను నిర్లక్ష్యం చేసి అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసారంటూ ఆయా గ్రామస్తులు వారికి పిర్యాదు చేస్తున్నారు.పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక చేసే వరకు విచారణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.అర్హులకు ఇళ్ళు మంజూరయ్యే వరకు విచారణ చేయరాదంటూ అధికారులను అడ్డ గిస్తున్నారు.దీనితో చేసేది ఏమీ లేక అధికారులు వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం లో మంగళవారం జరిగిన సంఘటన వివరాలు.. నారాయణపురం గ్రామ పంచాయితీ పరిధిలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారుల జాబితాను తనిఖీ చేసేందుకు విచారణ ప్రత్యేకాధికారి అయిన మండల వ్యవసాయాధికారి శివరామ ప్రసాద్,కార్యదర్శి మహేశ్వరీ లు పంచాయితీ కార్యాలయం వద్దకు వెళ్ళారు. జాబితాను పరిశీలిస్తుండ గా పంచాయితీ పరిధిలోని నారాయణపురం, పెంచికలపాడు,నెమలి పేట, సూర్యం పేట నిరుపేదలకు అక్కడకు చేరుకున్నారు. నిరుపేదల మైన తమకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయకుండా ఆస్తులు ఉన్న పెద్దలకు కేటాయించారని మడకం లక్ష్ముడు,నారాయణ,కుమారస్వామి, లక్ష్మణ్, బోయినపల్లి మధు లు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇందిరమ్మ గ్రామ కమిటీలు కూడా ఏకపక్షంగా వ్యవహరించారని,వలస రాజకీయ నేతల సూచనల మేరకు చేశారని,మహిళా కమిటీ సభ్యుల భర్తల పెత్తనం ఏమిటని నిలదీశారు.పేదలు అధికంగా ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేసి అనర్హులకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేశారంటూ అధికారులు, బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ళ మంజూరులో ప్రభుత్వం నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటిస్తే స్థానిక రాజకీయ నాయకులు తన అనుచరులకు ప్రాధాన్యత ఇచ్చారని ద్వజమెత్తారు. పేదలకు ఇళ్ళు మంజూరు చేసే వరకు సర్వే చేయొద్దని తేల్చి చెప్పారు. దీనితో సర్వే అధికారులు అక్కడ నుండి వెళ్ళిపోయారు.రాజకీయ నేతలు, బాధ్యులపై ఆయా గ్రామాల పేదలు అసహనం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img