Wednesday, April 30, 2025
Homeఆటలుఇక నుంచి పాక్‌తో ఎలాంటి క్రికెట్ ఆడొద్దు: గంగూలీ

ఇక నుంచి పాక్‌తో ఎలాంటి క్రికెట్ ఆడొద్దు: గంగూలీ

నవతెలంగాణ – హైదరాబాద్: పహల్గామ్ ఘటనపై టీంఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా మండిపడ్డారు. 2008 తర్వాత పాకిస్థాన్‌కు టీమ్‌ఇండియా వెళ్లని సంగతి తెలిసిందే. చివరిసారిగా 2012 – 13లో భారత్ వేదికగా ఇరు జట్ల మధ్య ద్వైపాకిక్ష సిరీస్ జరిగింది. అప్పట్నుంచి కేవలం తటస్థ వేదికల్లోనే తలపడుతూ వస్తున్నాయి. ఇక నుంచి పాక్‌తో ఎలాంటి క్రికెట్ ఆడొద్దని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. వందశాతం అంగీకరిస్తా. పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలి. అది జరిగి తీరాలి. తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉండటం తమాషా కాదు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదని గంగూలీ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img