Monday, May 19, 2025
Homeతాజా వార్తలుఇక లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

ఇక లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

- Advertisement -

– ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పగించేందుకు ఏర్పాట్లు
– డబ్బులిచ్చిన వారి వైపే మొగ్గు చూపే అవకాశాలు

– 30 శాతానికి పైగా గ్రామాల్లో భూ రికార్డులు గల్లంతు
– శాశ్వత ప్రాతిపదికన సర్వేయర్లను నియమిస్తేనే సమస్య కొలిక్కి
– సర్కార్‌ నిర్ణయం పట్ల ప్రజల్లో ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల కొత్త విధానానికి తెరలేపింది. రానున్న రోజుల్లో ప్రయివేట్‌ సర్వేయర్లను గుర్తించి వారికి భూ కొలతలు, రికార్డుల తయారీకి అనుమతివ్వాలని తీసుకున్న నిర్ణయం ప్రజలకు శరాఘాతంగా మారనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులకు పెను భారం కానుంది. డబ్బులిచ్చిన వారికే వకాల్తా పుచ్చుకుంటారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఈ విధానం అమల్లోకి వస్తే రాష్ట్రంలో తిరిగి పటేల్‌, పట్వారీ వ్యవస్థను మరిపించనుందనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో వందేండ్లుగా భూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటి పరిష్కారానికి స్వాతంత్య్రానంతరం నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర భూ రికార్డుల చట్టంలో అనేక మార్పులు చేశారు. అయినప్పటికీ భూ సమస్యలు కొత్త కొత్త రూపంలో పుట్టుకొస్తూనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత వీటికి చెక్‌ పెట్టాలని 2020లో పాత ఆర్వోఆర్‌ చట్టాన్ని రద్దు చేసి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే సమస్యలు తగ్గక పోగా మరిన్ని పెరిగాయి. 2023 డిసెంబర్‌లో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌ -2024 పేరిట ఇటీవల ”భూ భారతి చట్టాన్ని” తీసుకొచ్చింది. ఈ చట్టం కూడా సమగ్రంగా లేదని రైతు, ప్రజాసంఘాలు, భూ నిపుణులు అంటు న్నారు. ఈ క్రమంలో భూ సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. శాశ్వత భూధార్‌ అమలు, గెట్ల పంచాయితీకి ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటే సమగ్ర భూ సర్వే జరగా ల్సిందే. సర్కార్‌ కూడా ఈ విషయాన్ని అంగీక రించింది. ఇందుకోసం ఐదు వేల మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను త్వరలో నియమిస్తామని ప్రకటిం చింది. అయితే ప్రయివేట్‌ వ్యక్తులకు భూ కొలతలు, రికార్డుల తయారీ బాధ్యతను అప్పగిస్తే అవినీతికి రాజముద్ర వేసినట్టేననే ఆందోళన సర్వత్రా వ్యక్తమ వుతోంది. సర్కార్‌ తన నిర్ణయాన్ని మార్చుకుని శాశ్వత ప్రాతిపదికన సర్వేయర్లను నియమించాల్సిన అవసరముంది.
భూధార్‌ అమలు కావాలంటే….
ప్రతి భూదస్త్రానికి పక్కాగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్రం ప్రతిపాదించిన భూధార్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు పంచాయితీకి ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటే సమగ్ర భూ సర్వే జరగాల్సిందే. సర్కార్‌ కూడా ఈ విషయాన్ని అంగీకరించింది. ఇందుకోసం ఐదు వేల మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను త్వరలో నియమిస్తామని ప్రకటించింది. అయితే ప్రయివేట్‌ వ్యక్తులకు భూ కొలతలు, రికార్డుల తయారీ బాధ్యతను అప్పగిస్తే అవినీతికి రాజముద్ర వేసినట్టేననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సర్కార్‌ తన నిర్ణయాన్ని మార్చుకుని శాశ్వత ప్రాతిపదికన సర్వేయర్లను నియమించాల్సిన అవసరముంది.
భూధార్‌ అమలు కావాలంటే….
ప్రతి భూదస్త్రానికి పక్కాగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్రం ప్రతిపాదించిన భూధార్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయంచింది. ప్రతి పౌరుడికీ ‘ఆధార్‌’ కేటాయించినట్టే ప్రతి కమతానికీ ఒక విశిష్ట సంఖ్యను కేటాయించనున్నారు. భూధార్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం, హక్కులపరంగా గుర్తింపు వంటివి లభిస్తాయని భావిస్తున్నారు. వ్యవసాయ భూముల మాదిరిగా వ్యవసాయేతర స్థలాలకు ప్రత్యేక నంబర్లు కేటాయిస్తారు. రాష్ట్రంలో భూధార్‌ ప్రాజెక్టుని ముందు తాత్కాలికంగా అమలు చేయనున్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు భూసమస్యలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయడానికి ‘భూధార్‌’కేటాయింపు తోడ్పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. అయితే ఈ విధానాన్ని తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన రెండు దశల్లో అమలు చేయాలని సర్కార్‌ భావిస్తోంది. తొలుత సేత్వార్‌, ఖాస్రా తదితర మాతృదస్త్రాలను పరిశీలించి కమతాలను నిర్థారిస్తారు. అనంతరం భూధార్‌ సంఖ్యను కేటాయిస్తారు. భూధార్‌ సంఖ్యను నమోదుచేస్తే ఆ రైతు, భూమికి సంబంధించిన పూర్తి సమాచారం కనిపించనుంది. శాశ్వత ప్రాతిపదికన భూ సర్వేచేసి అక్షాంశాలు, రేఖాంశాలతో హద్దులు గుర్తించిన తర్వాతే భూధార్‌ కేటాయిస్తే ఈ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభిస్తుంది. రాష్ట్రంలో పక్కాగా భూదార్‌ అమలు కావాలంటే అందుకు శాశ్వత ప్రాతిపదికన సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బందిని నియమించాలి.
30 శాతం గ్రామాల్లో రికార్డులు గల్లంతు
సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ డిపార్ట్‌మెంట్‌ను 1875 సంవత్సరంలో బ్రిటీష్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసి భూమి హక్కులపై చట్టాలను రూపొందించింది. వాటి ఆధారంగానే నిజాం సంస్థానం 1940లో సమగ్ర భూ సర్వే నిర్వహించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలాంటి సర్వే జరగలేదని రికార్డులు చెబుతున్నాయి. ఆ రోజు నిర్వహించిన సర్వే ప్రకారం క్షేత్రానికి టీపాన్‌ అనే నంబర్‌ ఇచ్చారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన గ్రామ మ్యాప్‌లు (డ్రై వెట్‌), సేత్వార్‌, ఇతర రికార్డులను రూపొందించారు. ఆ రికార్డుల ద్వారానే భూ వివాదాలను పరిష్కరిస్తున్నారు. అయితే అవి 30 శాతానికిపైగా గ్రామాల్లో అందుబాటులో లేవు. ఎనభై ఏండ్ల సుధీర్ఘ కాలంలో తెలంగాణ భూ విధానంలో అనేక మార్పులొచ్చాయి. భూ మార్పిడి వల్ల కమతాల్లో హెచ్చుతగ్గులు, గెట్లు మారడం, సర్వే నెంబర్ల ప్రకారం పాస్‌ పుస్తకాల మీద ఒకరుంటే, మోకా మీద మరొకరుండటం లాంటి అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
శాశ్వత ప్రాతిపదికన సర్వేయర్లను నియమించాలి
రాష్ట్రంలో భూధార్‌ అమలు జరగాలంటే సమగ్ర భూసర్వే జరగాలి. అప్పుడే భూ సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభిస్తుంది. అయితే సర్వే యర్లను లైసెన్స్‌డ్‌ పద్ధతిలో నియమిస్తే అవినీతి భారీ స్థాయిలో పెరిగిపో తుంది. ఎవరికి డబ్బులిస్తే వారి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ విధానం వల్ల పేద రైతులకు తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుని శాశ్వత ప్రాతిపదికన అవసరమైన సర్వేయర్లను, రెవెన్యూ సిబ్బందిని నియమించాలి.
– టి.సాగర్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -