Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంఇస్రో మ‌రో కీల‌క విజ‌యం

ఇస్రో మ‌రో కీల‌క విజ‌యం


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా రెండో డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. PSLV-C60/SpaDeX మిషన్‌లో భాగంగా రెండో డాకింగ్‌ ప్రక్రియ సోమవారం పూర్తయిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.‘‘ఉపగ్రహాల రెండో డాకింగ్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. PSLV-C60/SpaDeX మిషన్‌ను గత ఏడాది డిసెంబర్‌ 30న ప్రయోగించాం. ఆ తర్వాత తొలిసారిగా శాటిలైట్లను ఈ ఏడాది జనవరి 16న విజయవంతంగా అనుసంధానించాం. అదేవిధంగా మార్చి 13న వాటిని అన్‌డాకింగ్‌ చేశాం. రాబోయే రెండు వారాల్లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నాం’’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img