Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంఈనెల 26న పోప్‌ అంత్యక్రియలు

ఈనెల 26న పోప్‌ అంత్యక్రియలు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కేథలిక్‌ల మతగురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ సోమవారం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు శనివారం ఉదయం (ఏప్రిల్‌ 26) 10 గంటలకు సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో నిర్వహించనున్నట్లు వాటికన్‌ వర్గాలు మంగళవారం తెలిపాయి. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని బుధవారం సెయింట్‌ పీటర్స్‌ బసిలికాలో ఉంచనున్నట్లు వాటికన్‌ వర్గాలు తెలిపాయి. కాగా, పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు హాజరుకానున్నారు. అలాగే అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలే కూడా హాజరుకానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img