నవతెలంగాణ-హైదరాబాద్: ఉక్రెయిన్‌తో ఒప్పంద చేసుకోవడానికి మాస్కో సిద్ధంగా ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. తాము ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని, కానీ కొన్ని అంశాలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సి వుందని అన్నారు. ప్రస్తుతం ఆ అంశాల్లో బిజీగా ఉన్నామని సెర్గీ గురువారం మీడియాతో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ శుక్రవారం రష్యాలో పర్యటించనున్నారు. కాల్పుల విరమణపై పుతిన్‌తో మరో రౌండ్ చర్చలు జరపనున్నారు. చర్చల ప్రక్రియ సరైన దిశలో సాగుతోందని, వాషింగ్టన్‌తో చర్చలు కొనసాగుతాయని సెర్గీ లావ్రోవ్ అన్నారు.
- Advertisement -