నవతెలంగాణ-హైదరాబాద్: ఉగ్రదాడిని బగ్నాం చేయడంలో నిఘా వ్యవస్థ వైఫల్యం చెందిదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై తన నిరోధక విధానం పనిచేస్తుందో లేదో కేంద్ర ప్రభుత్వం పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. ఉరి, పుల్వామా దాడుల కంటే పర్యాటకులను చంపడం బాధాకరమన్నారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ దుర్ఘుటనపై కేంద్రం పూర్తిగా విచారణ చేపట్టి..బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రదాడిలో గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నామని ఆయన తెలిపారు. ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను చంపడం హేమమైన చర్య అని, చంపే ముందు ఏ మతమో అడిగి మరి చంపాడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో కేంద్రం బాధితులకు అండగా ఉండాలని, ఘటనకు బాధ్యులైన వ్యక్తులపై బీజేపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉగ్రకుట్రను చేధించడంలో నిఘా వ్యవస్థ విఫలం: అసదుద్దీన్ ఒవైసీ
- Advertisement -