– కేవీపీఎస్, డీవైఎఫ్‌ఐ నాయకులు
– సుందరయ్య పార్క్‌లో క్యాండిల్ ర్యాలీ
నవతెలంగాణ – ముషీరాబాద్
కాశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవా దుల కాల్పులను ఖండించాలని, దాడి పిరికిపంద చర్య అని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోటా రమేష్, ఆనగంటి వెంకటేష్ అన్నారు. కాశ్మీర్‌లో ఉగ్రవాద కాల్పులను నిరసిస్తూ బుధవారం డీవైఎఫ్‌ఐ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్క్‌లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మృతిచెందిన పర్యాటకులకు నివాళ్లర్పించారు. ఈ సందర్బంగా స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ ప్రజలతో పాటు దేశ ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైందన్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని, దేశ సమైక్యత సమగ్రత కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ.. ఇలాంటి ఘట నలు పునరావృతం కాకుండా, ప్రాణ నష్టాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలని, కాశ్మీర్లో శాంతి నెలకొల్పాలని అన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్‌కే రాష్ట్ర కార్యదర్శి భూపతి వెంకటేశ్వరు, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు హష్మీ బాబు, జావీద్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామర కిరణ్, పార్క్ కార్యదర్శి మనోహర్, టీపీటీఎల్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమ్ము విజరు, నాయకులు బాల్గరి పవన్, హస్మిత, వినరు, రఘు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఉగ్రవాదులది పిరికిపంద చర్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES