Tuesday, April 29, 2025
Navatelangana
Homeతాజా వార్తలుఉగ్రవాద హత్యాకాండ అమానుషం

ఉగ్రవాద హత్యాకాండ అమానుషం

- Advertisement -

– జమ్మూ కాశ్మీర్‌లో శాంతి నెలకొల్పాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘పర్యాటక ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద ముష్కరులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 28 మంది అమాయక పౌరులు, పర్యాటకులను అతి క్రూరంగా చంపేశారు. చనిపోయినవారిలో హైదరాబాద్‌ ఇంటలిజెన్స్‌ బ్యూరోలో పనిచేస్తున్న మనీష్‌ రంజన్‌ కూడా ఉన్నారు. ఇది దేశ పౌరులనే కాదు, ప్రపంచ దేశాలను కలచివేసే ఘటన. అమానవీయ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నది. గాయపడిన 20మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మతంపేరుతో జరుగుతున్న ఇలాంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి, మాటలతో సరిపెట్టకుండా అన్ని కోణాలనుంచి దర్యాప్తు చేయాలనీ, దుండగులను న్యాయస్థానం ముందుంచి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో శాంతి నెలకొనేలా, ఇలాంటి ఉగ్రవాద ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించి అక్కడి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు