నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరాఖండ్ టెహ్రీలో విషాద ఘటన చోటుచేసుకుంది. హరిద్వార్ నుంచి వస్తున్న కారు అదుపుతప్పి దేవ్‌ప్రయాగ్ సమీపంలోని బాద్షా హోటల్ వద్ద 300 మీటర్ల లోతైన లోయలో పడిపోయి అలకనంద నదిలో మునిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఒక మహిళను రక్షించగా, ఇద్దరు పిల్లలు సహా ఐదుగురు గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, గల్లంతయిన ఐదుగురు మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
- Advertisement -