వేసవి వచ్చిందంటే మామిడి పండ్లు, సెలవులు, శుభకార్యాల హడావుడితో పాటు ఉక్కబోతనూ మోసుకు వస్తుంది. ఓ వైపు వేడి, చెమట, మరోవైపు ఉక్కబోత. వీటిని తట్టుకుని ఈ వేసవి నుండి బయటపడాలంటే శరీరం నీటిని కోల్పోకుండా కాపాడుకోవాలి. ఆహారంలో నీరు, పోషకాలు ఎక్కువగా ఉండే పదార్థాలను చేర్చాలి. మసాలాలు, వేపుళ్లకు దూరం ఉండాలి. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. తగినంత నీరు తాగటం కంటే వేసవి తాపాన్ని నివారించడంలో మరొక ఉపాయం లేదు.
మనిషి ప్రతిరోజూ శరీరం నుండి నీటిని ఆవిరి రూపంలో కోల్పోవడం సహజం. ఇది శరీరం నుండి చమట, మూత్రం రూపంలో బైటికి వెళ్తుంది. చెమటతోపాటు అధిక మోతాదులో శరీరంలోని లవణాలను కూడా కోల్పోతాం. ఆ లవణాలను తిరిగి పొందడానికి శరీరాన్ని తేమగా ఉంచుకోవడం అవసరం. సమ్మర్‌లో చర్మం పొడిబారినట్లు, నల్లగా కమిలినట్లు అగుపిస్తుంటే డీహైడ్రేషన్‌కు గురైనట్లు తెలుసుకోవాలి. అలాగే యూరిన్ కలర్ కూడా పరిశీలించాలి. యూరిన్ పసుపు లేదా ఎరుపు వర్ణంలో ఉంటే డీహైడ్రేషన్‌కు గురవుతున్నట్లు గుర్తించాలి. శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్‌గా ఉంచితే శరీరంలోని విషతుల్య పదార్ధాలను తొలగించడంతో పాటు, మేలిమి ఛాయతో చర్మం మెరుస్తుంది. ఆరోగ్యకరమైన బరువు నిర్వహణ, జ్ఞాపకశక్తి పెరుగుదలకు దోహదపడుతుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తలనొప్పిని సైతం నిరోధిస్తుంది. అయితే, నీటిని నేరుగా తాగడానికి, కొంతమంది విముఖత ప్రదర్శిస్తుంటారు. చిన్నపిల్లల్లో ఈ స్వభావాన్ని గమనిస్తుంటాం కూడా. భానుడి భగభగ నుంచి ఉపశమనం పొందేందుకు జ్యూసులు, శీతల పానీయాలు ఏ మేరకు మేలు చేస్తాయో చెప్పలేం కానీ సమ్మర్‌లో దొరికే తాటిముంజలు మాత్రం ఆరోగ్యంతో పాటు చల్లదనాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. తాటి ముంజల్లో ఉండే పోషకాలు వేసవి వేడిమి నుంచి ఉపశమనం కలిగించడతో పాటు పలు ఆనారోగ్య సమస్యలకు చక్కటి ఔషధంలా పని చేస్తాయి.
ఎండల్లో కూల్ కూల్
- Advertisement -