Tuesday, April 29, 2025
Homeజాతీయంఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు

ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఎన్నికల సంఘం రాజీ పడిందని ఆరోపించారు. అంతేకాదు, ఆ వ్యవస్థలో చాలా లోపాలున్నాయన్నారు. ఇందుకు ఇటీవలే జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఉదాహరణగా చెప్పారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ బోస్టన్‌లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఈసీపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ, రేపు యూఎస్‌లో రాహుల్ గాంధీ ప‌ర్య‌టిస్తారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రోడ్‌ ఐలాండ్‌లోని బ్రౌన్‌ యూనివర్సిటీని ఆయ‌న‌ సందర్శిస్తారు. అక్కడ విద్యార్థులు, అధ్యాపకులతో చర్చలో పాల్గొంటారు. అంతేకాదు ఎన్నారై సంఘాలు, ఇండియా ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ సభ్యులతో రాహుల్‌ సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇటీవలే ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img