Monday, May 5, 2025
Homeజాతీయంఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు

ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు

- Advertisement -

– తిరుపతి రూరల్‌లో 42.1 డిగ్రీలు నమోదు
– నేడు 28మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
– సమీక్షించనున్న హోంశాఖ మంత్రి
అమరావతి:
రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఎండలతో పాటు పెద్ద ఎత్తున వీస్తున్న వడగాడ్పులతో ప్రజానీకం తల్లడిల్లుతోంది. తిరుపతిరూరల్‌లో సోమవరం 42.1 డిగ్రీల సెల్షియస్‌, అన్నమయ్య జిల్ల కంబాలకుంట, విజయనగరంలో 41.5డిగ్రీలు, నెల్లూరు జిల్లాదగదర్తిలో 41.4డిగ్రీలు, ఏలూరు జిల్లా దెందులూరులో 41.3డిగ్రీలు, నంద్యాలజిల్లా గోనవరం,పల్నాడు జిల్లా రావిపాడులో 41.1 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు మరికొద్ది రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చ రించింది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు (మంగళవారం) 28 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని, మరో 21 మండలాల్లోనూ వడగాడ్పులు వీస్తాయని ఆ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం 12 మండలాల్లో తీవ్ర వడ గాడ్పులు, మరో 20 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 13, పార్వతీపురం మన్యంలో 11 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచనున్నాయి. విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక ల నేపథ్యంలో వడగాడ్పులు, ఎండల తీవ్రతపై పూర్తిస్థాయిలో సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నేతృత్వాన మంగళవారం (నేడు) ఈ సమావేశం జరగనుంది. వడగాడ్పులకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, రాబోయే వర్షాకాలానికి సంసిద్ధత వంటి అంశాలను ఈ సమావేశంలో సమీక్షిస్తామని అధికారులు తెలిపారు. ఈ సమావేశం అనంతరం విజయవాడలో ని అగ్నిమాపక విభాగం ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకుఆ శాఖ ఉన్నతాధి కారులతో హోంశాఖ మంత్రి భేటీ కానున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -