ముంబయి : కెనరా రోబెకో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఇందుకోసం ప్రతిపాదిత పత్రాలను సెబీకి సమర్పించింది. ఐపీఓ ప్రతిపాదిత పత్రాల ప్రకారం.. ఆఫర్ ఫర్ సేల్‌లో ప్రమోటర్లు తమ 4.98 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. అదే విధంగా ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ 2.59 కోట్ల షేర్లను, ఓరిక్స్ కార్పొరేషన్ 2.39 కోట్ల షేర్ల చొప్పున ఉపసంహరించుకోనుంది. 2024 డిసెంబర్ నాటికి ఈ సంస్థ 25 స్కీమ్‌లను కలిగి ఉంది. రూ.1,08,366 కోట్ల ఎయుఎం కలిగి ఉంది. ఈ ఇష్యూ ద్వారా రూ.800-100 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- Advertisement -