నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బొగుళూరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) ఘోర ప్రమాదం జరిగింది. బొగుళూరు సమీపంలోని ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నంబర్ 12 వద్ద ప్రమాద వశాత్తు అదుపుతప్పిన కారు డీవైడర్‌ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని కారు బోల్తా కొట్టింది. దీంతో కారును నడుపుతున్న దండుగుల తిరుమలేశ్ (30) అనే వ్యక్తి.. అందులో నుంచి రోడ్డుపై పడిపోయారు. తలకు బలంగా దెబ్బతగలడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆదిభట్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రాహీంపట్నం దవాఖానకు తరలించారు
- Advertisement -