నవతెలంగాణ – హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 400 ఎకరాలకు సంబంధించిన భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఎక్స్’ వేదికగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలుగుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 10 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనుమతి లేకుండా చెట్లు కొట్టివేసినట్లు తేలితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లవలసి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. చెట్లు కొట్టివేసే ముందు అనుమతి ఉందా, లేదా అనేది కీలకమని పేర్కొంది.
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. స్పందించిన కేటీఆర్
- Advertisement -
RELATED ARTICLES