Tuesday, April 29, 2025
Navatelangana
Homeనేటి వ్యాసంకళాకారుని మాట

కళాకారుని మాట

- Advertisement -

నా చుట్టూ క్షణక్షణం
అమానవీయ భయంకర
యుద్ద వాతావరణం అలముకుంటున్నది

ఇక ఇప్పుడు నాది
అంతరించి పోతున్న
ఓ చిన్న పక్షి
అస్థిత్వ జీవ స్థితి

విహంగ వీక్షణం తప్ప
కటికవాస్తవాన్ని
ప్రతిఘటించే దారి
కానరాకున్నది

శిధిలాల మధ్యకూడా
గడ్డిపూలు ఎందుకలా
స్వేచ్ఛగా నవ్వగలుగుతున్నాయి?

‘క్షమాపణ అడగను’
కళాకారుని మాట
నేడు జగమంతా
పరిమళిస్తూనే ఉన్నది

నిజమైన భయం ఇక
మొదలైంది కిరాయిల మూకకు

రాలుతానని తెలిసినా
రాలేంతవరకు
నవ్వుతూనే ఉంటాయి
పువ్వులు

నవ్వు అచంచలగా
ముందుకు పోతుంది
రాక్షసత్వానికి నిజంగానే
అంతం పలుకుతుంది.
కె.శాంతారావు

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు