- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని గుంతకల్లు రైల్వే వంతెన సమీపంలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఆలూరు కాంగ్రెస్ ఇన్‌ఛార్జి లక్ష్మి నారాయణను దుండగులు లారీతో ఢీకొట్టారు. అనంతరం వేటకొడవళ్లతో నరికి చంపారు. ఈ దాడిలో లక్ష్మినారాయణ కుమారుడు వినోద్‌కు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.