Saturday, May 17, 2025
Homeజిల్లాలుకాంగ్రెస్ సీనియర్ నేత వెదిరె మధుసూదన్ రెడ్డి కన్నుమూత..

కాంగ్రెస్ సీనియర్ నేత వెదిరె మధుసూదన్ రెడ్డి కన్నుమూత..

- Advertisement -

నవతెలంగాణ మునుగోడు:

మండలంలోని కొంపెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు , మాజీ పెద్ద చెరువు చైర్మన్ వెదిరె మధుసూదన్ రెడ్డి (95) ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాదులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. మధుసూదన్ రెడ్డి ఇకలేరు అనే విషయం తెలుసుకున్న గ్రామంలోని ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. గ్రామ ప్రజలను మధుసూదన్ రెడ్డి ఆప్యాయతగా పలకరించి మహోన్నతమైనటువంటి వారు అని గ్రామ ప్రజలు గుర్తు చేశారు. మధుసూదన్ రెడ్డి చిన్న వయసు నుండే కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేశారని గ్రామంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అని అన్నారు.

మధుసూదన్ రెడ్డి మృతితో గ్రామంలోని ప్రజలు కన్నీరు మున్నారుగా రోధిస్తున్నారు. మధుసూదన్ రెడ్డి అంత్యక్రియలు శనివారం స్వ గ్రామం కొంపెల్లిలో నిర్వహించనున్నట్లు వెదిరె మెగా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజేందర్ రెడ్డి తెలిపారు. మధుసూదన్ రెడ్డికి సంతాపం తెలియజేసిన వారిలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్, మాజీ ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, జిల్లా నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి, పాల్వాయి జితేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు జాల వెంకన్న యాదవ్, బోయపర్తి లింగయ్య, మాజీ ఎంపీటీసీ దాం పార్వతి లింగయ్య, మక్కెన అప్పారావు, గ్రామ శాఖ అధ్యక్షులు దాం యాదయ్య, బోయపర్తి ప్రసాద్, వివిధ పార్టీల నాయకులు, వివిధ గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, మండలంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -