నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లోని కాంతి హైస్కూల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థిని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే ను శనివారం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కాంతి హై స్కూల్ వ్యవస్థాపకులు మరియు కరస్పాండెంట్ శ్రీ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు తమ విద్య ప్రస్థానంలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తిచేసుకుని ప్రైమరీ ఎడ్యుకేషన్ లోకి అడిగిడుతున్న సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నామన్నారు. మా పాఠశాలలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వారి సంపూర్ణ అభివృద్ధియే ధ్యేయంగా మేము మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నామని అన్నారు. దీనికి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులైన మీ సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ శశాంక్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి విద్యా జీవితంలో ప్రీ ప్రైమరీ నుండి ప్రైమరీ ఎడ్యుకేషన్ లోకి ప్రవేశించడం అంటే మొదటి మెట్టు నుండి రెండో మెట్టుకు చేరుకోవడం లాంటిదని అన్నారు. కావున విద్యార్థులు క్రమశిక్షణతో ఏకాగ్రతతో చదివి ఇంకా ఉన్నత విద్యలు అభ్యసించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యతగా ఉంటూ వారి విద్యా ప్రయాణంలో తమ వంతు పాత్ర పోషించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కాంతి హైస్కూల్ లో ప్రీప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే సంబరాలు
- Advertisement -
RELATED ARTICLES