– ప్రతి రంగం కార్మికుడు సమాజ హితం కోసమే
– ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
– మండల వ్యాప్తంగా ఘనంగా మే డే వేడుకలు
నవతెలంగాణ – రాయపర్తి : కార్మికుల చెమట చుక్కలే దేశ అభివృద్ధికి పునాదులు అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని శ్రీనివాస్ రెడ్డి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కార్మిక అరుణ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజ పురోగతికి మొదట పునాది వేసే మహనీయులే కార్మికులు అని కొనియాడారు. ప్రభుత్వాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన శ్రమనుడిచి సమాజానికి అభివృద్ధిని చూపెట్టేది కార్మికులే అని తెలిపారు. ప్రపంచ భవిష్యత్తు కార్మికుల పైన ఆధారపడి ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అన్నారు. రాయపర్తి మండల వ్యాప్తంగా మేడే వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరు కార్మిక లోకానికి చేతులెత్తి నమస్కరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాయపర్తి మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క కార్మికుడికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేతకుల రంగా రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్ నాయక్, నాయకులు తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, ఎలామంచ శ్రీనివాస్ రెడ్డి, పరుపాటి రవీందర్ రెడ్డి, గజావెల్లి ప్రసాద్, పెరటి యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల చెమట చుక్కలే.. దేశ అభివృద్ధి పునాదులు
- Advertisement -
RELATED ARTICLES