Wednesday, May 7, 2025
Homeజాతీయంకేంద్రం సమగ్ర దర్యాప్తు చేయాలి

కేంద్రం సమగ్ర దర్యాప్తు చేయాలి

- Advertisement -

– పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించిన సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్న పర్యాటకులపై విచ క్షణా రహితంగా కాల్పులు జరిపి 28మంది పర్యాటకులను పొట్టన బెట్టుకున్న తీవ్రవాదుల దుశ్చర్యను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రం గా ఖండించింది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పో యిన వారికి సంతాపాన్ని తెలియచేస్తూ వారి కుటుంబాలకు సానుభూతి తెలి పింది. ఈ దాడిలో అనేకమంది తీవ్రంగా గాయపడ్డారని, వారు త్వరగా కోలుకో వాలని ఆశిస్తున్నట్టు పేర్కొంది. ఇంతటి దారుణానికి పాల్పడిన కిరాతకులను పట్టుకుని శిక్షించాలని సీపీఐ(ఎం) పేర్కొంది. అక్కడ పోలీసులు, భద్రతా దళాలు కేంద్ర ప్రభుత్వ అధీనంలో వున్నాయి. ఈ దాడికి పాల్పడిన వారిని పట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటువంటి దారుణమైన నేరాలకు పాల్పడేవారు దేశానికి, ముఖ్యంగా కాశ్మీర్‌ ప్రజలకు శత్రువులని పేర్కొంది. పర్యాటకులతో రద్దీగా వుండే ప్రాంతాల్లో సరైన భద్రత లేకపోవడంతో సహా దాడికి సంబంధించిన పలు కోణాల్లో తక్షణమే సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొంది. ఈ విషాద సమయంలో తీవ్రవాద, ఛాందసవాద శక్తులకు వ్యతిరేకంగా దేశ ప్రజలకు సీపీఐ(ఎం) బాసటగా నిలబడుతుందని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -