నవతెలంగాణ-హైదరాబాద్: కేవలం హింది భాషపైనే తమ పోరాటం కాదని, తమిళ జాతి సంస్కృతి, సంప్రదాయల సంరక్షణ కోసం పోరాటమని తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఇది భాషపై పోరాటం కాదు, తమిళ సంస్కృతిని “రక్షించడానికి” ఒక జాతి పోరాటంగా కొనసాగుతుందన్నారు. పెరియార్, గ్రాండ్ మాష్టర్ అన్నా, ముత్తమిళర్ కలైంజర్‌ల నాయకుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని బలవంతంగా హింది భాష రుద్దడంపై పోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని నందనం కాలేజ్ లో నూతనంగా నిర్మిస్తున్న కలైంజర్ కలైయరంగం ఆడిటోరియాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ కాలేజ్ వేదికగా 1986 నాటి హింది వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేశారు. 1956 నాటి హింది వ్యతిరేక ఉద్యమంలో భారీ యోత్తున విద్యార్థులు పాల్గొన్నారని, దీంతో ఆనాటి కేంద్రం ప్రభుత్వం NEET, NEP తమ రాష్ట్ర విద్యార్థులకు అడ్డకులు సృష్టించారని ఆరోపించారు. ఇప్పుడు త్రిభాష సూత్రంతోనే ఈ వ్యహారం ఆగదని, పలు విధాలుగా తమిళ సంస్కృతిని ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు. హింది భాష రుద్దడంతోపాటు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నీట్ ఎంట్రన్స్ విధానంలో హిందీ భాషను తప్పనీసరి చేస్తున్నారని ఉదయ్‌నిధి వివరించారు.
కేవలం హింది భాషపైనే తమ పోరాటం కాదు: ఉదయనిధి స్టాలిన్
- Advertisement -
RELATED ARTICLES