- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.ఆయన ప్రసంగం అక్కసుతో కూడుకున్నదని ఆరోపించారు. ఖజానాను ఖాళీ చేసి తమపై నిందలు వేస్తున్నారని, ఆ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని సీఎం అన్నారు. కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడారు. ఆయన ప్రసంగంలో స్పష్టత లేదు. రాహుల్‌గాంధీకి, తనకు గ్యాప్ ఉందనడం అవాస్తవం. రాహుల్‌కు, తనకు ఉన్న సంబంధం ప్రపంచానికి చెప్పనవసరం లేదు. అవసరాలను బట్టి కేసీఆర్, మోదీ మాటలు మారుస్తున్నారు. దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలని రేవంత్‌రెడ్డి చెప్పారు.