No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతాజా వార్తలుకేసీఆర్ విచార‌ణ తేదీలో మార్పు

కేసీఆర్ విచార‌ణ తేదీలో మార్పు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కాళేశ్వరం తో పాటు అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవినీతిని బయట పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ జస్టిస్ పీసీ చంద్రఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్‌ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌ తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు , ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఈటల రాజేందర్‌ లను విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ ఇటీవలే వారికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జూన్ 5న కేసీఆర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను జూన్ 5న విచారణకు హాజరు కాలేనని.. జూన్ 11న తప్పక హాజరవుతానంటూ తాజాగా కేసీఆర్, కమిషన్‌కు సమాచారం అందజేశారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని అంగీకరించిన కాళేశ్వరం కమిషన్ విచారణ తేదీని ఈ నెల 11కు వాయిదా వేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad