నవతెలంగాణ – రాయపర్తి : ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని గురువారం మండలంలోని కొండూరు గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు నేరెళ్ల మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయపర్తి ఎస్సై శ్రావణ్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి వేడుకను ప్రారంభించారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రంగం కార్మికుడు టెంకాయలు కొట్టారు. తదుపరి కార్మిక సంఘం గ్రామ అధ్యక్షుడు మహేష్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ… భవన నిర్మాణ కార్మికులు సమాజ అభివృద్ధికి దర్శకులు అని తెలిపారు. సమాజంలో ఒకరిగా ఉంటూ సమాజ హితం కోసం పాటుపడే వారే కార్మికులు అని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క కార్మికునికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కర్ర రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, సంఘం కార్యదర్శి నేరెల్లి రాములు, ఉపాధ్యకుడు చౌద సుధాకర్, కోశాధికారి పూస సత్తయ్య, కటారి ఏసుబాబు, బార్ల యాకయ్య, ల్యాదెళ్ళ దర్గా స్వామి, ల్యాదెళ్ళ కాశీవిశ్వనాథ్, ఒంగూరు దేవి, ల్యాదెళ్ళ అనిల్, నేరిల్లి సమ్మయ్య, ఎండి యాకుబ్, రామారాపు బాబు తదితరులు పాల్గొన్నారు.
కొండూరు గ్రామంలో ఘనంగా మేడే వేడుక
- Advertisement -
RELATED ARTICLES