నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని సాకేత్ కోర్టు ప్రముఖ హక్కుల కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ నేత మేథాపాట్కర్‌కు నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను ఢిల్లీ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేయనున్నారు. ఆ తర్వాత ఆమెను న్యాయస్థానంలో హాజరపర్చనున్నారు. ప్రస్తుత ఢిల్లీ ఎల్‌జి వికె సక్సేనా 24 ఏళ్ల కింద నమోదు చేసిన ఒక పరువునష్టం కేసులో ప్రముఖ పర్యావరణ ఉద్యమవేత్త మేథా పాట్కర్‌పై ఢిల్లీ కోర్టు బుధవారం నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది. అదనపు సెషన్స్ జడ్జి విశాల్ సింగ్ ఈ వారెంట్ జారీ చేశారు. ఈ నెల 8న జరిగిన ఈ కేసు గత విచారణలో మేథాప్కాటర్ ఏప్రిల్ 23న (బుధవారం) కోర్టుకు హాజరుకావాలని, ప్రొబేషన్ బాండ్లు, రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించారు. బుధవారం 70 ఏళ్ల మేథాపాట్కర్ కోర్టుకు హాజరుకాలేకపోయారు. దీంతో జడ్జి ‘ఢిల్లీ పోలీస్ కమిషనర్ ద్వారా పాట్కర్‌పై నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేస్తూ’ ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణ మే 3 నాటికి మేథాపాట్కర్ తమ ఆదేశాలను పాటించాలని జడ్జి స్పష్టం చేశారు. నర్మదా బచావో ఉద్యమం సమయంలో గుజరాజ్‌లో ఒక ఎన్‌జిఓకు సక్సెనా చీఫ్‌గా ఉన్నారు. ఆ సమయంలో తన పరువునకు నష్టం కలిగించే విధంగా మేథాపాట్కర్ వ్యాఖ్యలు చేశారని సక్సేనా ఈ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
కోర్టు ఆదేశాలతో మేథాపాట్కర్ అరెస్ట్..!
- Advertisement -
RELATED ARTICLES