నవతెలంగాణ-హైదరాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ముగింపునకు చేరుకున్నాయి.రాష్ట్ర రాజధాని ట్యాంక్ బండ్ పై గణనాథుల విగ్రహాలు బారులుతీరాయి. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా పిల్లలు, యువత, భక్తులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆటపాటలతో సందడి చేస్తున్నారు.
మరోవైపు నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా..పోలీసు యంత్రాంగా అహర్నిషులు శ్రమిస్తుంది. ట్రాఫిక్ జాం కాకుండా పకబ్బందీగా చర్చలు తీసుకొని వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని సజావుగా సాగేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. తాజాగా డీజే పాటలకు పోలీసన్నలు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో పోలీసు అధికారులు డాన్స్ చేసి సందడి చేశారు.డీజే పాటలకు పోలీసన్నలు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో పోలీసు అధికారులు డాన్స్ చేసి సందడి చేశారు.