నవతెలంగాణ-హైదరాబాద్: గుజరాత్‌లో ఓ ప్రయివేటు విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ట్రైనీ ఫైలట్ మృతి చెందాడు. ఓ ప్రయివేటు సంస్థకు చెందిన విమానం గాలిలో అదుపు తప్పి ఒక్కసారిగా ఆమేలీ జిల్లాలోని నివాస ప్రాంతాల మధ్య కూలిపోయింది. ప్రమాద ధాటికి విమానం రెండు ముక్కలై.. మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు..మంటల్లో చిక్కుకున్న ఫైలట్‌ను వెలికతీసి..స్థానికి ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో వెంటనే మంటలను ఆర్పేశారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన ఫైలట్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే మృతి చెందాడని ఫైర్ ఆఫీసర్ HC గాధ్వి తెలిపారు. ప్రమాదానికి గురైన విమానం విజన్ సంస్థకు చెందినది, అనికేత్ మహాజన్ అనే ట్రైని ఫైలట్ మరణించాడని, ప్రమాదానికి గల కారణాలను తెలియాల్సిందని డిప్యూటీ ఎస్పీ చిరాగ్ దేశి చెప్పారు. ఘటనలో ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు అన్నారు.
గుజరాత్‌లో కూప్పకూలిన ఓ ప్రయివేటు విమానం…ట్రైనీ ఫైలట్ మృతి
- Advertisement -
RELATED ARTICLES