Tuesday, April 29, 2025
Navatelangana
Homeజాతీయంగుడిబండలో చిరుతల కలకలం ..

గుడిబండలో చిరుతల కలకలం ..

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల కేంద్రం సమీపంలో చిరుతపులుల సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామానికి అత్యంత సమీపంలో ఉన్న కొండపై చిరుతలు గుంపులుగా సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ పరిణామంతో గుడిబండ వాసులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. గ్రామానికి దగ్గరలోని కొండ ప్రాంతంలోని పొదల్లో చాలా కాలంగా 3 చిరుతలు ఆవాసం ఏర్పరుచుకున్నాయని స్థానికులు తెలిపారు. పగటిపూట కొండపైనే ఉంటున్న చిరుతలు, రాత్రి సమయాల్లో ఆహారం కోసం గ్రామ పరిసరాల్లోకి వస్తున్నాయని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నివాస ప్రాంతాలకు సమీపంలోకి వచ్చి పశువులపై దాడులకు పాల్పడుతుండటంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో కొన్ని పశువులను చిరుతలు చంపినట్లు కూడా సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు