– ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
– ఐఐటి సాధించిన విద్యార్థినికి ఆర్థిక సహాయం
నవతెలంగాణ – రాయపర్తి
గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువులో ప్రతిభ కనబరిస్తే ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని మర్రి రక్షిత ఐఐటి బాసరలో సీటు సాధించినందుకు గాను మంగళవారం శ్రీనివాస్ రెడ్డి విద్యార్థికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు విద్యలో, క్రీడల్లో రాణించాలని కోరారు. అనుభవాజ్ఞులైన ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తుంటారని వారి సూచనలు మేరకు చదువుపై ఆసక్తి పెంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్ నాయక్, మండల పార్టీ నాయకులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, లేతకుల మధుకర్ రెడ్డి, పెరటి యాదవ రెడ్డి, రాయపర్తి మాజీ సర్పంచ్ గారే నర్సయ్య, మాజీ ఎంపీటీసీ ఐత రాంచందర్, గ్రామ పార్టీ అధ్యక్షులు ముద్రబోయిన సుధాకర్, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ప్రతినిధులు గజావెల్లి ప్రసాద్, ఎండీ యూసఫ్, కుందూరు యాదగిరి రెడ్డి, సంకినేని ఎల్లస్వామి, పోగులకొండ వేణు, చిలువేరు సాయి గౌడ్, ఐత రాజు, ఉబ్బని సింహాద్రి, పెద్దగోని జీవన్, చందు లక్ష్మన్, ఐత రవి, ఎండీ యకూబ్, ఐత జంపి, గుండె రాకేష్ తదితరులు పాల్గొన్నారు.