Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్చలో ముధోల్ ను విజయవంతం చేయండి: భీమ్ ఆర్మీ పిలుపు

చలో ముధోల్ ను విజయవంతం చేయండి: భీమ్ ఆర్మీ పిలుపు

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్

చలో ముధోల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భీమ్ ఆర్మీ అధ్యక్షులు అజయ్, కార్యదర్శి కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని, భోగిరాం గ్రామంలో మే 12వ తేదీ బౌద్ధ పౌర్ణమి రోజున దళితులు బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని మనువాదులు సుమారు 500 మంది ముక్కుమ్మడిగా దళితులపై దాడి చేసి, అక్కడి నుండి బుద్ద విగ్రహాన్ని ముధోల్ తహసిల్ కార్యాలయానికి తరలించడం దురదృష్టకరం అన్నారు.
ప్రపంచానికి శాంతి బోధలను చేసిన మహనీయుడు భారతదేశంలో పుట్టి ప్రపంచ దేశాల్లో అనేక బౌద్ధ ఆరామాల్ని నెలకొల్పిన శాంతి ప్రదాత గౌతమ బుద్ధుడు. ఆయన కులాలకు, మతాల అతీతంగా మానవులంతా ఒక్కటి శాంతి మార్గమే జీవన్ముక్తి అనే నినాదంతో ప్రపంచంలోని మనుషులంతా శాంతి ప్రేమ సౌమ్యత్వంతో జీవించాలని బోధించిన మహనీయుడు బౌద్ధుడు, అలాంటి మహనీయుని విగ్రహ ఏర్పాటును భంగపరిచి, దళితులపై దాడులకు పాల్పడ్డ మనువాదులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ, సోమవారం 19వ తేది భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో ముధోల్ పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించడానికి, అదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన వివిద జిల్లాల అధ్యకులు, కార్యదర్శులు, యావత్ బీమ్ ఆర్మీ సైనికులు, శాంతి ర్యాలీ నిర్వహించ తలపెట్టినట్లు నిజామాబాద్ జిల్లా అధ్యకుడు అజయ్, జిల్లా కార్యదర్శి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్ నిర్మల్ జిల్లాల ఇన్చార్డ్ టి.ఎన్ రమేష్ రావణ్, బీమ్ ఆర్మీ యువ నాయకులు శాంతి నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఒక్క దళిత సంఘాల నాయకులు, శాంతిని కోరుకునే పౌరులు, కార్యకర్తలు మే 19 సోమవారం రోజు చలో ముధోల్ కార్యక్రమానికి హాజరై శాంతి ర్యాలీలో పాలుపంచుకోవాలని, ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ నాయకులు అన్ని దళిత సంఘాలకు, పిలుపునిస్తున్నట్లు మీడియా తెలియజేస్తున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -