Wednesday, April 30, 2025
Homeసినిమాచాలా కాలం గుర్తుండిపోయే సినిమా

చాలా కాలం గుర్తుండిపోయే సినిమా

శ్రీదేవీ మూవీస్‌ పతాకంపై శివలెంక కష్ణ ప్రసాద్‌ నిర్మాణంలో మోహనకష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూపా కొడువయూర్‌ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఈనెల 25న రిలీజ్‌  కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కష్ణ ప్రసాద్‌ మీడియాతో ముచ్చటించారు.
ఈ చిత్రంలో యాక్షన్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌, కామెడీ, లవ్‌ ఇలా అన్ని రకాల అంశాలుంటాయి. ఇంద్ర గంటి కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యాను. థియేటర్లో అందరూ హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది. జంధ్యాలతో ఇలాంటి ఓ పూర్తి వినోదాత్మక సినిమా చేయలేదే? అనే లోటు ఈ సినిమాతో తీరిపోయింది. కొన్ని చిత్రాలు ఆడియెన్స్‌కి ఎప్పుడూ గుర్తుండిపోతాయి. అలా ఈ
చిత్రం చాలా కాలం పాటు గుర్తుంటుంది.
‘జెంటిల్‌ మాన్‌, సమ్మోహనం’ తరువాత మా కాంబోలో హ్యాట్రిక్‌ హిట్‌ రాబోతోంది. మోహనకష్ణ రాసిన కథ, కథనం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీతో పాటుగా యూత్‌ ఆడియెన్స్‌
అందరినీ మెప్పిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. సరైన థియేటర్లతోపాటు మంచి సీజన్‌ దొరకాలనే ఇప్పటి వరకు ఆగాం. సమ్మర్‌ హాలీడేస్‌ మంచి సీజన్‌ అనుకుని మేం ఏప్రిల్‌ 25న వస్తున్నాం. సమ్మర్‌లో వినోదాన్ని పంచేందుకు మా చిత్రం రాబోతోంది.
ఈ చిత్రాన్ని ఇప్పటికే చాలా మందికి చూపించాం. అందరూ అద్భుతంగా ఉందని అన్నారు. ఫస్ట్‌ హాఫ్‌ పూర్తిగా వినోదాత్మ కంగా సాగుతుంది. ఇక ద్వితీ యార్ధం నెక్ట్స్‌ లెవెల్లో ఉంటుంది. జాతకం చుట్టూ ఈ కథ తిరుగు తుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా, సస్పెన్స్‌గా ఉంటుంది. అలా అని మరీ అంత అన్‌ ప్రిడిక్టబుల్‌గా ఏమీ ఉండదు. అందరినీ హాయిగా ఎంటర్టైన్‌ చేసేలా మాత్రం
ఉంటుంది.
కథలో భాగంగానే కారెక్టర్లు వస్తాయి. ఏదో కావాలని ఇరికించినట్టుగా ఎక్కడా అనిపించదు. ప్రతీ పాత్రకు చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుంది. వెన్నెల కిషోర్‌, వైవా హర్ష, నరేష్‌, అవసరాల శ్రీనివాస్‌ ఇలా అన్ని కారెక్టర్లు అద్భుతంగా నవ్విస్తాయి.
ఈ కథ విన్నాక దర్శి అయితే బాగుంటుందని మేం అను కున్నాం. తను ఈ చిత్రానికి వంద శాతం న్యాయం చేశారు.
‘సమ్మోహనం’ లాంటి లవ్‌ స్టోరీ అయినా, ‘జెంటిల్‌మెన్‌’ లాంటి చిత్రమైనా, కామెడీని పండిం చడంలో ఇంద్రగంటి మార్క్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇంద్రగంటి కామెడీ టైమింగ్‌ ఈ చిత్రంలో నెక్ట్స్‌ లెవెల్లో ఉంటుంది. ఈ చిత్రం పైసా వసూల్‌గా ఉంటుంది. జంధ్యాల కామెడీ, ఈవీవీ స్టైల్‌, ఇంద్రగంటి మార్క్‌ ఇలా అన్నీ ఉండేలా.. అందరినీ మెప్పించేలా, అందరికీ రీచ్‌ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది.
నాకు సీక్వెల్స్‌ అంటే చాలా భయం. అందుకే నేను వాటికి దూరంగా ఉంటాను. కానీ బాలకష్ణ మాత్రం ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ పనులు స్టార్ట్‌ చేస్తే, దానిలో భాగం అవుతాను. ‘యశోద’ డైరెక్టర్లు చెప్పిన రెండు కథలతోపాటు పవన్‌ సాధినేని చెప్పిన కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా
అనిపించింది. మళ్లీ ఇంద్రగంటితో ఇంకో సినిమా చేయబోతున్నాను. 
– నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌నాకు సీక్వెల్స్‌ అంటే చాలా భయం. అందుకే నేను వాటికి దూరంగా ఉంటాను. కానీ బాలకష్ణ మాత్రం ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ పనులు స్టార్ట్‌ చేస్తే, దానిలో భాగం అవుతాను. ‘యశోద’ డైరెక్టర్లు చెప్పిన రెండు కథలతోపాటు పవన్‌ సాధినేని చెప్పిన కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మళ్లీ ఇంద్రగంటితో ఇంకో సినిమా చేయబోతున్నాను.
– నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img