నవతెలంగాణ – అమరావతి: తిరుపతి జిల్లాలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. రహస్యంగా చెట్ల చాటున సారా తయారుచేసి చెట్టు తొర్రలో దాచిన వైనాన్ని డ్రోన్ల సాయంతో గుర్తించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో బాకరాపేట సీఐ ఇమ్రాన్ బాషా ఆధ్వర్యంలో పోలీసులు ఈ దాడులు జరిపారు. యర్రవారి పాళ్యం మండలంలోని వేములవాడ గ్రామం, తలకోన వాటర్ కెనాల్ సమీపంలో నాటు సారా స్థావరాన్ని గుర్తించి, చెట్టు తొర్రలో దాచిన తొమ్మిది లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. నాటు సారా కాస్తున్న వేముల హనుమంతు, మునిస్వామిని అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -