Wednesday, April 30, 2025
Homeఆటలుచెన్నై ఓపెన్‌కు గ్రీన్‌ సిగల్‌?

చెన్నై ఓపెన్‌కు గ్రీన్‌ సిగల్‌?

– అక్టోబర్‌లో నిర్వహణకు సన్నాహాలు
చెన్నై : 2022 తర్వాత అటకెక్కిన డబ్ల్యూటీఏ చెన్నై ఓపెన్‌ మళ్లీ పట్టాలెక్కనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో డబ్ల్యూటీఏ 250 టోర్నమెంట్‌ నిర్వహణకు ప్రణాళిక రచిస్తున్నారు. ఈ ఏడాది శత వసంతాల ఉత్సవాలు చేసుకుంటున్న తమిళనాడు టెన్నిస్‌ అసోసియేషన్‌ (టిఎన్‌టీఏ) అందులో భాగంగానే అక్టోబర్‌లో చెన్నై ఓపెన్‌ను నిర్వహించాలని చూస్తోంది. డబ్ల్యూటీఏ అనుమతి కోసం లభించిన వెంటనే టోర్నమెంట్‌ షెడ్యూల్‌ను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ‘ ఈ ఏడాది డబ్ల్యూటీఏ 250 టోర్నమెంట్‌ను నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎస్‌డిఏటీ టెన్నిస్‌ స్టేడియం ఇప్పటికే పలు ప్రమాణిక పరీక్షలు పాసైంది. డబ్ల్యూటీఏ నుంచి తుది అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని’ టిఎన్‌టీఏ అధ్యక్షుడు విజరు అమృత్‌రాజ్‌ తెలిపాడు. చెన్నై ఓపెన్‌కు తమిళనాడు ప్రభుత్వం రూ.2.55 కోట్ల ప్రైజ్‌మనీ అందించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img