అంబేద్కర్ జయంతి సామాన్యుడి స్వాతంత్రదినం!
సామాన్యుణ్ణి మాన్యుణ్ణి చేసిన అతడి
కష్టాల ఆనవాళ్లు కూడా తెలీని రాజకీయం
దండలు దండాలతో దండెత్తి సమత మమత అంటూ గొంతెత్తి
అనుచరగణమై చుట్టుముడుతుంది
బతికున్నప్పుడు అంటరానివాడు ఇప్పుడు అంటకాగతగినవాడవుతాడు
తరతరాల అణగారిన బతుకుల్ని వెలిగించిన
చైతన్యమూర్తిని ఒక దళితాస్త్రంగానే చూస్తుంది
కులమత ప్రసక్తి లేని ఆయన ‘నవభారతం’ అర్థంకాకపోయినా
ఎన్నికల కురుక్షేత్రంలో కులమతాలతో గెలవటం తెల్సుకొంటుంది
తరాలుగా ఆ కీర్తి శిఖరాన్ని తవ్వుకుంటూ
తరాలకు సరిపడా రాజకీయ యాపారంలో
తలోకాస్తా సంపాయించుకున్న ముందుచూపు ఖద్దరు తలకాయిలు..
తెల్లారింది మొదలు తండోపతండాలుగా
కూడళ్ళలో విగ్రహాల మీద పడి వేడి చల్లారకుండా
వెలుగు నింపుకొని పోతుంటారు
మళ్ళీ నేటిదాకా అతణ్ణి అంటరానివాణ్ణి చేసి..!
(అంబేద్కర్ జయంతి)
– భీమవరపు పురుషోత్తమ్, 9949800253
చైతన్యమూర్తి
- Advertisement -