నవతెలంగాణ- హైదరాబాద్: చైనాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లియోనింగ్ ప్రావిన్స్‌లోని లియోయాంగ్ నగరంలో మంగళవారం ఓ రెస్టారంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22మంది మృతి చెందారని సమాచారం. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందించారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
- Advertisement -